Goddess Statue found in Grain Bags: ఏపీ చిత్తూరు జిల్లా దామలచెరువు పంచాయతీ బండకాడపల్లిలోని రైతు మురళి ఇంట్లో నిల్వ ఉంచిన ధాన్యంలో అమ్మ వారి పంచలోహ విగ్రహం లభ్యమైంది. ఈ విగ్రహం సుమారు అడుగు ఎత్తు, రెండు కిలోల బరువు ఉంది. పద్మాసనంపై ఏడు శిరస్సుల నాగేంద్రుని నీడలో నాలుగు చేతులతో బంగారు వర్ణంలో మెరిసిపోతున్న అమ్మవారి విగ్రహాన్ని ఇంటి యజమాని గురప్ప, ఆయన కుమారుడు మురళి గుర్తించారు. వెంటనే విషయాన్ని గ్రామస్థులకు తెలిపారు.
ఇంట్లోనే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి విగ్రహాన్ని చూసేందుకు జనం భారీగా తరలి వస్తున్నారు. గ్రామంలో గుడి నిర్మించి అమ్మవారిని ప్రతిష్టించాలని గ్రామస్థులు కోరుతున్నారు.