బద్వేలు ఉప ఎన్నికలో (badvel by- election) భాజపా అభ్యర్థిగా పనతల సురేశ్‌ను ఎంపిక చేసినట్లు చేసినట్లు ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. భాజపా అభ్యర్థి సురేశ్.. రేపు నామినేషన్ వేయనున్నారు. పెనగలూరు మండలానికి చెందిన సురేశ్.. 2019 ఎన్నికల్లో రైల్వేకోడూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఏబీవీపీ తరఫున కడప జిల్లాలో అనేక ఉద్యమాలు చేసిన మంచి పేరు తెచ్చుకున్న సురేశ్‌కు .. ఉప ఎన్నిక కలిసి వస్తుందని భావిస్తున్నారు.
అధికార పార్టీ నుంచి సుధ..
దివంగత ఎమ్మెల్యే డా.వెంకటసుబ్బయ్య ఆకస్మిక మరణంతో బద్వేలు ఉప ఎన్నిక (badvel by- election) అనివార్యమైంది. అధికార పార్టీ తరఫున వెంకటసుబ్బయ్య భార్య సుధ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కమలమ్మ పోటీ చేయనున్నారు. తెదేపా, జనసేన ఉప ఎన్నికకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ నెల 30న బద్వేలు ఉప ఎన్నికకు (badvel by- election) పోలింగ్ జరగనుంది. ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు పోలింగ్ జరుగుతుంది. బద్వేలు పరిధిలో 2,16,139 మంది ఓటర్లు ఉండగా.. అందులో 1,07,340 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈవీఎంల ద్వారా పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఇదీ చదవండి: Badwel By-Poll: 'లక్ష ఓట్ల మెజార్టీయే లక్ష్యం'..వైకాపా అభ్యర్థి నామినేషన్