"భయపడ్డారు కాబట్టే అడ్డుకుంటున్నారు" - trs general secretary
సాధారణంగా ప్రభుత్వాలు ఎన్నికలు నిర్వహించేందుకు వెనకడుగేస్తాయని... కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం సమయానికి జరగాలని కోరుకుంటోందని తెరాస ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసముందని తెలిపారు.
"భయపడ్డారు కాబట్టే అడ్డుకుంటున్నారు"
అధికారంలో ఉన్న పార్టీ సమయానికి మున్సిపల్ ఎన్నికలు జరగాలని కోరుకుంటుంటే భాజపా, కాంగ్రెస్‌లు ఎన్నికలు వాయిదా పడాలని చూస్తున్నాయని తెరాస ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు భయపడి, అడ్డుకునేందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే ఎన్నికలకు సిద్ధపడే వాళ్లం కాదని స్పష్టం చేశారు. కేవలం ప్రచారం కోసమే విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయని దుయ్యబట్టారు.
- ఇదీ చూడండి : సీబీఐ ప్రశ్నల వర్షానికి స్పందించని చిదంబరం