తెలంగాణ

telangana

ETV Bharat / city

బంగారు రేకుపై ఈటీవీ లోగో, అభిమానం చాటుకున్న మైక్రో ఆర్టిస్ట్‌ - ఏపీ తాజా వార్తలు

Micro Artist ETV logo ఈనాడు టెలివిజన్ సంస్థలు ప్రారంభించి 27 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా అద్భుతమైన మైక్రో ఆర్ట్ కళారూపంలో ఈటీవీ లోగోను తయారు చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు పలాసవాసి. ఈ లోగోని రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకి బహుమతిగా ఇవ్వడానికి తయారు చేశానని తెలిపారు.

Micro Artist ETV logo
Micro Artist ETV logo

By

Published : Aug 27, 2022, 8:28 PM IST

Micro Artist ETV logo ఈనాడు టెలివిజన్ సంస్థలు ప్రారంభించి.. 27 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈటీవీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఓ కళాకారుడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కొత్తపల్లి రమేశ్ ఆచారి అద్భుతమైన మైక్రో ఆర్ట్ కళారూపాన్ని తయారుచేశారు. సుమారు 150 మిల్లీగ్రాముల బంగారపు రేకుపై సెంటీమీటర్ ఎత్తు, రెండు సెంటీమీటర్ల వెడల్పు ఉన్న అద్భుత ఈటీవీ లోగో తయారుచేసి తన అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ లోగోని ఈటీవీ ఛైర్మన్ రామోజీరావుకి బహుమతిగా ఇవ్వడానికి తయారు చేశానని తెలిపారు. దీనిని తయారు చేయడానికి సుమారు మూడు గంటల సమయం పట్టిందని తెలిపారు. ఈటీవీ అందిస్తున్న సేవలకు గానూ ప్రేమతో ఈ మైక్రో ఆర్ట్‌ను తయారు చేశానన్నారు.

బంగారు రేకుపై ఈటీవీ లోగో

ABOUT THE AUTHOR

...view details