కొత్త రెవెన్యూ చట్టంతో రైతులు, పేద ప్రజల సమస్యలు తీరనున్నాయని తెరాస ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ అన్నారు. గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.కేసీఆర్ పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందన్నారు.
'కొత్త రెవెన్యూ చట్టంతో రైతులు, పేదలకు ఎంతో మేలు' - గన్‌పార్కు వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ పాలాభిషేకం చేశారు. కేసీఆర్ పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందన్నారు.
'కొత్త రెవెన్యూ చట్టంతో రైతులు, పేదలకు ఎంతో మేలు'
అవినీతిమయమైన రెవెన్యూ చట్టాన్ని రద్దు చేసి రైతులందరికి మేలు చేసే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజల అభినందనలు పొందారని పేర్కొన్నారు. భూముల విలువ పెరగటం వల్లే కబ్జా కోరులు, బోకర్లు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని.. ఇకపై వారి ఆటలు సాగవని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:రెవెన్యూ బిల్లుకు శాసన మండలి ఆమోదం