KTR tweet : కర్ణాటకలోని ఓ అంకుర సంస్థ సీఈవో రవిష్ నరేశ్ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. కర్ణాటక రాష్ట్రంలోని కోరమంగల ప్రాంతంలో రోడ్లు అత్యంత దయనీయంగా ఉన్నాయని, నిత్యం విద్యుత్ కోతలు, నాణ్యమైన నీటి సరఫరా లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, గ్రామాల్లో సరైన రహదారులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తూ రవిష్ నరేష్ ట్వీట్ చేశారు. కోరమంగల ప్రాంతం నుంచి బిలియన్ డాలర్లను పన్నుల రూపంలో చెల్లిస్తున్నా.. సరైన మౌలిక సదుపాయాలు లేవని ట్వీట్ చేశారు.
KTR tweet: బ్యాగ్‌లు సర్దుకొని హైదరాబాద్ వచ్చేయండి.. కేటీఆర్ సలహా
KTR tweet : కర్ణాటకలో మౌలిక వసతులు సరిగా లేవంటూ ట్వీట్ చేసిన ఓ అంకుర సంస్థ నిర్వాహకుడికి తనదైన శైలిలో కేటీఆర్ రిప్లై ఇచ్చారు. హైదరాబాద్‌లో అద్భుతమైన వసతులున్నాయని.. వెంటనే బ్యాగ్ సర్దుకొని వచ్చేయాలని సూచించారు.
ktr
ఈ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్.. బ్యాగ్‌లు సర్దుకొని హైదరాబాద్ వచ్చేయమని సదరు వ్యక్తికి సలహా ఇచ్చారు. హైదరాబాద్‌లో అద్భుతమైన మౌలిక సదుపాయాలున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం 3ఐ (ఇన్నోవేషన్, ఇన్ప్రాస్టక్చర్, ఇన్క్లోజిల్ గ్రోత్ ) సూత్రంతో ముందుకెళ్తోందని స్పష్టం చేశారు.
ఇదీచూడండి:KTR Tweets to Modi : కేంద్రంపై కేటీఆర్ ట్విటర్ వార్