తెలంగాణ

telangana

ETV Bharat / city

దెబ్బకు ఠా.. ఓజీ దొంగల ముఠా..! - Hyderabad Crime Latest News

బస్సుల్లో ప్రయాణించే ఒంటరి మహిళలు, వృద్ధులు, యువతులను లక్ష్యంగా చేసుకొని దృష్టిమళ్లించి చోరీలకు పాల్పడుతున్న ఓజీ కుప్పం దొంగల ముఠా హైదరాబాద్‌ పోలీసులకు చిక్కింది. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారన్న పోలీసులు.. గాయత్రి అనే మహిళ ఆ ముఠాకు నేతృత్వం వహిస్తోందని వివరించారు. హైదరాబాద్‌ పరిధిలోని 3 కమిషనరేట్లలో ఆ ముఠాపై పలు కేసులున్నట్లు తెలిపారు.

దెబ్బకు ఠా.. ఓజీ దొంగల ముఠా..!
దెబ్బకు ఠా.. ఓజీ దొంగల ముఠా..!

By

Published : Dec 14, 2019, 5:06 AM IST

Updated : Dec 14, 2019, 5:12 AM IST

3 కమిషనరేట్లు - 13 కేసులు
హైదరాబాద్‌లో తొలిసారిగా.. ఐదుగురు సభ్యుల ఓజీ కుప్పం ముఠా పోలీసులకు పట్టుబడింది. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా వివిధ రాష్టాల్లో పర్యటిస్తూ ప్రయాణికుల దృష్టి మళ్లించి నేరాలకు పాల్పడుతుంటారు. ఓజీ కుప్పం ముఠాకు చెందిన గాయత్రి ఆమె భర్త రాజు, సోదరి కోకిల, జ్యోతి ముఠాలో నిందితులుగా ఉన్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో ఈనేరగాళ్లపై 13 కేసులు నమోదయ్యాయి.

దెబ్బకు ఠా.. ఓజీ దొంగల ముఠా..!

25 తులాల బంగారం మాయం
మెహదీపట్నానికి చెందిన జయలక్ష్మి అనే వృద్ధురాలు జూన్‌లో సికింద్రాబాద్‌ నుంచి మెహదీపట్నం వరకు బస్సులో ప్రయాణించింది. గమ్యం చేరిన తర్వాత సంచి చూసుకోగా... అందులో 25 తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. నేరం జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు పరిశీలించి అనుమానితులను ఆరాతీశారు.

దొంగను పట్టించిన ఫోన్​ నెంబర్​
ఒక చోట పోలీసులకు ఊహించిన ఆధారాలు లభించడం వల్ల అక్కడ సాంకేతిక ఆధారాలు సేకరించారు. కొన్ని కర్ణాటకకు చెందిన సెల్‌ నెంబర్లు గుర్తించి వాటి ఆధారంగా నిఘా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో ఆ ముఠాను పట్టుకున్నారు. ప్రతి రెండు నెలలకోసారి ఓనగరానికి వెళ్లి దృష్టి మళ్లించి చోరీలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ముఠాపై పీడీ చట్టం ప్రయోగం..?
దొంగిలించిన ఆభరణాలను విక్రయించగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 35 తులాల బంగారం, 8 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై పోలీసు అధికారులు పీడీ చట్టం ప్రయోగించే యోచనలో ఉన్నారు.

ఇవీ చూడండి: మౌలాలీలో గంజాయి స్వాధీనం

Last Updated : Dec 14, 2019, 5:12 AM IST

ABOUT THE AUTHOR

...view details