ఏపీలోని విశాఖ ఉక్కు పరిశ్రమ నుంచి మహారాష్ట్రకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు బయల్దేరింది. మహారాష్ట్ర నుంచి ఏడు ట్యాంకర్లతో గురువారం తెల్లవారుజామున స్టీల్ ప్లాంటుకు రైలు చేరుకోగా... జాగ్రత్తలను పాటిస్తూ స్టీల్ కర్మాగారం సిబ్బంది ట్యాంకర్లలో ఆక్సిజన్ నింపారు.
మహారాష్ట్రకు బయల్దేరిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్...! - news updates in vizag steel plant
ప్రాణవాయువు కొరతతో సతమతమవుతున్న మహారాష్ట్రకు ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంటు ఊపిరందిస్తోంది. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా 105 టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను ఉక్కు పరిశ్రమ అధికారులు పంపిస్తున్నారు.
![మహారాష్ట్రకు బయల్దేరిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్...! oxygen-express-moving-from-visakhapatnam-to-maharashtra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11504369-742-11504369-1619115958707.jpg)
oxygen-express-moving-from-visakhapatnam-to-maharashtra
తొలివిడతలో ఏడు ట్యాంకుల ద్వారా 105 టన్నుల ఆక్సిజన్ మహారాష్ట్రకు రవాణా అవుతోంది. ఆక్సిజన్ ప్రత్యేక రైలుకు తూర్పు కోస్తారైల్వే గ్రీన్ ఛానెల్ ద్వారా మార్గం కల్పిస్తోంది.