కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తి భార్యను వారుంటున్న ఇంటి యజమాని ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న అమానవీయ ఘటన నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరిగింది. పట్టణంలోని కట్టెల వీధికి చెందిన నాగేశ్వరరావు కరోనా పరీక్షలు చేసుకోగా.. ఫలితాల్లో పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
కరోనాతో వ్యక్తి మృతి... భార్యను వెళ్లగొట్టిన ఇంటి యజమాని - నెల్లూరు కరోనా వార్తలు
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కరోనాతో మరణించిన వ్యక్తి భార్యను ఇంట్లోకి రాకుండా యజమాని అడ్డుకున్నాడు. ఇంటి బయటే కూర్చొని మృతుడి భార్య రోధించారు.
CORONAVIRUS
తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించగా.. శుక్రవారం మృతి చెందారు. అతడి భార్య ఉదయం ఇంటికెళ్లగా రానీయకుండా ఇంటి యజమాని అడ్డుకున్నారు. ఇంటికి తాళం వేయడంతో ఆమె లగేజీతో బయటే కూర్చొని రోధించారు.
ఇదీ చూడండి:ఉత్తమ్‌కు వీహెచ్ లేఖ.. ఎందుకో తెలుసా?