హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పరిధిలోని అన్నపూర్ణ కేంద్రాల్లో రాత్రిపూటా భోజనం అందిస్తున్నారు. 150 కేంద్రాల ద్వారా భోజనం అందజేస్తున్నామని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
అన్నపూర్ణ కేంద్రాల్లో రాత్రిపూట ఉచిత భోజనం - Overnight meals
హైదరాబాద్‌లో ఇక నుంచి రాత్రిపూట కూడా ఉచితంగా భోజనం లభించనుంది. ఎక్కడని అనుకుంటున్నారా.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 అన్నపూర్ణ కేంద్రాల్లో నిన్నటి నుంచి రాత్రిపూటా భోజనం అందిస్తున్నారు.
అన్నపూర్ణ కేంద్రాల్లో రాత్రిపూట భోజనం
రాత్రిపూట వచ్చే వారికి భోజన సదుపాయాలు కల్పించామన్నారు. హైదరాబాద్‌లో కరోనా నివారణకోసం పని చేస్తున్న పలు రకాల సిబ్బందిని మంత్రి కేటీఆర్ అభినందించారు.
ఇదీ చూడండి :ఫేస్బుక్ వల.. 12 లక్షలు స్వాహా
Last Updated : Mar 29, 2020, 7:43 AM IST