తెలంగాణ

telangana

ETV Bharat / city

'తాయిలాలే తప్ప... తెరాస చేసిందేమి లేదు' - జీహెచ్ఎంసీ షెడ్యూల్ 2020

గౌడ కులస్థులకు మంత్రి కేటీర్​ క్షమాపణలు చెప్పాలని జై గౌడ సంఘం, ఓయూ ఐకాస నేతలు డిమాండ్​ చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన పాపయ్య గౌడ్​ను అవమానించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారాల్లో తాయిలాలు తప్ప... గౌడ కులస్థులకు చేసిందేమి లేదని స్పష్టం చేశారు.

ou jac fire on minister ktr
ou jac fire on minister ktr

By

Published : Nov 28, 2020, 12:20 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస పతనమే ధ్యేయంగా పనిచేస్తామని జై గౌడ సంఘం, ఓయూ ఐకాస నేతలు స్పష్టం చేశారు. జలవిహార్​లో ఈనెల 26న జరిగిన గౌడ కులస్థుల ఆత్మీయ సమ్మేళనంలో... సర్వాయి సర్దార్ పాపయ్య గౌడ్ చిత్రపటాన్ని పెట్టకుండా తమను మంత్రి కేటీఆర్ అవమానించారని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపన్న గౌడ్ విగ్రహం పెట్టొద్దని మంత్రి కేటీఆర్ హుకుం జారీ చేయడం దారుణమని... తక్షణమే గౌడ్ కులస్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీ గౌడ కులానికి రెండు, మూడు తాయిలాలు తప్ప... చేసిందేమి లేదని దుయ్యబట్టారు.

బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన పాపయ్య గౌడ్​ను అవమానించడం సరికాదని... ఈ విషయాన్ని గౌడ కుల పెద్దలు కూడా గ్రహించి తెరాసకు బుద్ధి చెప్పాలని కోరారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న రాష్ట్రంలో విద్యార్థులే బలయ్యారని ఓయూ ఐకాస నాయకుడు డా.సాంబ శివ గౌడ్ అన్నారు. రాష్ట్ర సాధనలో కంటే... రాష్ట్రం ఆవిర్భవించిన తరువాతే విద్యార్థులు నిరుద్యోగంతో ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను మోసం చేసిన తెరాసకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: బల్దియా పోరు: గల్లీల నిండా జిల్లాల నాయకులే!

ABOUT THE AUTHOR

...view details