ఏపీలోని గుంటూరు జిల్లా ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రంలో నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి. వీటి శాస్త్రీయ నామం లూట్రా లూట్రా. క్షీరద రకానికి చెందినవి. పెద్దగా అలికిడి లేని నీటి వనరులున్న ప్రాంతంల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. వీటి ప్రధాన ఆహారం చేపలు. కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో అడపా దడపా నీటి కుక్కలు కనిపిస్తుంటాయి.
పక్షుల సంరక్షణ కేంద్రంలో నీటి కుక్కల సందడి - Uppalapadu Bird Sanctuary latest news
ఏపీలోని గుంటూరు జిల్లా ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రంలో నీటి కుక్కలను అటవీ అధికారులు గుర్తించారు. ప్రకాశం బ్యారేజీ ప్రాంతంలో అప్పుడప్పుడు కనిపించే ఈ జీవులు ఇప్పుడు ఉప్పలపాడు చెరువులోకి చేరాయి. అంతరించిపోతున్న ఈ జీవ జాతి సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Uppalapadu Bird Sanctuary
అక్కడి నుంచి కృష్ణా కాలువల ద్వారా ఉప్పలపాడు చెరువులోకి ఇవి వచ్చి ఉంటాయని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం చెరువులో సుమారు డజను నీటి కుక్కలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇవి ఉదయం, సాయంత్రం మాత్రమే కాసేపు నీటిపైకి వచ్చి తల బయటకు పెట్టి చూస్తుంటాయి. అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్న వీటి సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు.