గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహా రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో 2019-20 సంవత్సరం ఆస్తి పన్ను బకాయిల చెల్లింపు కోసం అమలు చేస్తున్న ఓటీఎస్ పథకం గడువును ప్రభుత్వం పొడిగించింది. బకాయిలను 90 శాతం వడ్డీ మినహాయింపుతో చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఓటీఎస్ అవకాశం కల్పించింది.
ఆస్తి పన్ను బకాయిలపై ఓటీఎస్ పథకం గడువు పొడిగింపు - Telangana Govt extends OTS scheme on property tax arrears till March 31
రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో 2019-20 సంవత్సరం ఆస్తి పన్ను బకాయిల చెల్లింపు కోసం అమలు చేస్తున్న ఓటీఎస్ పథకం గడువును ప్రభుత్వం పొడిగించింది. బకాయిలను 90 శాతం వడ్డీ మినహాయింపుతో చెల్లించే ఈ ఓటీఎస్ పథకాన్ని మార్చి 31 వరకు పొడిగిస్తూ అవకాశం కల్పించింది.
ots scheme extended to march 31 in corporation
నెలాఖరు(మార్చి 31) వరకు గడువు పొడిగిస్తూ... పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తి పన్ను బకాయిదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.