పీజీ రెండో సంవత్సరం పరీక్షలను అక్టోబరు 12 నుంచి నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయించింది. అక్టోబరు 12 నుంచి 16 వరకు పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. అదేవిధంగా పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు అక్టోబరు 19 నుంచి 27 వరకు జరగనున్నట్లు పేర్కొన్నారు.
అక్టోబరు 12 నుంచి పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు - ఓయూ తాజా వార్తలు
అక్టోబరు 12 నుంచి 16 వరకు ఓయూ పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. అక్టోబరు 19 నుంచి 27 వరకు పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు కూడా నిర్వహించనున్నట్లు ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు.
అక్టోబరు 12 నుంచి పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుందని ఆయన తెలిపారు. పూర్తిస్థాయి టైం టేబుల్ త్వరలో ప్రకటించనున్నట్లు కంట్రోలర్ వెల్లడించారు
ఇవీ చూడండి:ఈసెట్ అభ్యర్థులకు మొదటి విడత సీట్ల కేటాయింపు