ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం.. బతికుండగానే.! - ఉస్మానియా ఆసుపత్రి తాజా సమాచారం

11:42 June 22
ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం.. బతికుండగానే.!
ఉస్మానియా ఆస్పత్రిలో మరోసారి సిబ్బంది నిర్వాకం బయటపడింది. బతికిఉన్న మహిళ చనిపోయినట్లు కుటుంబసభ్యులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఒకే వయస్సులో ఉన్న ఇద్దరు మహిళలు చేరారు. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది.
మరో మహిళ శ్వాస సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరింది. ఉస్మానియాలో చికిత్స పొందుతూ కరోనా సోకిన మహిళ మృతి చెందింది. బతికిఉన్న మహిళ చనిపోయిందని ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చికిత్స పొందుతున్న తన తల్లి ఎలా చనిపోయిందని కూమార్తె నిలదీయగా అసలు విషయం తెలిసింది. సిబ్బంది తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఇదీ చూడండి :వర్మ ఇంతటి నీచానికి దిగజారతారనుకోలేదు : అమృత