తెలంగాణ

telangana

ETV Bharat / city

పరారీలో జ్యూయలరీ షాపు నిర్వాహకులు... ఖాతాదారుల ఆందోళన - గుడివాడలో ఓషియ జ్యువెలరీ

ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడలో ఓషియ జ్యూయలరీ నిర్వాహకుడు ఐపీ పెడుతున్నాడనే ప్రచారంతో ఖాతాదారులు షాపు ముందు ఆందోళన చేపట్టారు. జ్యూయలరీ దుకాణం నిర్వాహకులు, పాన్ బ్రోకర్ ముకేశ్ రెండు రోజులుగా పరారీలో ఉండటం వల్ల తమకు న్యాయం చేయాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు.

oshia-jewellery-manager-cheating-at-gudivada-in-krishna-district
పరారీలో జ్యూయలరీ షాపు నిర్వాహకులు... ఖాతాదారుల ఆందోళన

By

Published : Dec 11, 2020, 3:42 PM IST

ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడలో ఓషియ జ్యూయలరీ నిర్వాహకుడు రెండు రోజులుగా పరారీలో ఉండటం వల్ల ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. పాన్ బ్రోకర్ ముకేశ్ వద్ద గుడివాడ పరిసర ప్రాంతాలకు చెందిన వేల మంది.. తమ ఆభరణాలు తాకట్టు పెట్టి రూ.5 కోట్ల వరకు అప్పులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముకేశ్ ఐపీ పెడుతున్నాడనే ప్రచారంతో భారీ మొత్తంలో ఖాతాదారులు ఓషియ జ్యూయలరీ షాపు వద్దకు చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆందోళన చేపట్టారు.

గుడివాడ 2వ టౌన్ పోలీసులు జోక్యం చేసుకొని చిన్న మొత్తాల్లో రుణాలు తీసుకున్న వాళ్లకు టోకెన్లు పంపిణీ చేస్తూ.. అభరణాలు అందిస్తున్నారు. విలువైన ఆభరణాలు తాకట్టు పెట్టి, పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్న బాధితులు.. తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

బాధితులందరికీ న్యాయం జరిగేలా చూడాల్సిన పోలీసులు కొందరికే టోకెన్లు ఇవ్వడంపై ప్రజా సంఘాల నాయకులు ఖండిస్తున్నారు. ఐపీ ప్రచారంతో ఆందోళనలో చెందుతున్న ఖాతాదారులు.. అధిక మొత్తాలకు అప్పులు తెచ్చి తమ అభరణాలను విడిపించుకునేందుకు ఓషియ జ్యూయలరీ దుకాణం వద్ద పడిగాపులు కాస్తున్నారు.

ఇదీ చూడండి: కోటిన్నర నగదుతో ఉడాయించిన గోల్డ్​ షాప్ యజమాని!

ABOUT THE AUTHOR

...view details