తెలంగాణ

telangana

ETV Bharat / city

Paddy Procurement: వారు సొంత రిస్క్​తో వరి సాగు చేసుకోవచ్చు: సీఎస్​ - రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

పారాబాయిల్డ్ బియ్యం తీసుకోరాదని కేంద్ర ప్రభుత్వం, ఎఫ్​సీఐ నిర్ణయించాయని సీఎస్​ సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో యాసంగిలో సాగయ్యే వరి పారాబాయిల్డ్ బియ్యానికే అనుకూలమన్నారు. రైతులు యాసంగిలో వరి సాగు చేయవద్దని చెప్పారు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలు చేసుకునే వారు సొంత రిస్క్​తో వరి సాగు చేసుకోవచ్చని తెలిపారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్లు చర్య తీసుకోవాలన్నారు.

orders-to-officers-for-paddy-procurement-in-telanagana
orders-to-officers-for-paddy-procurement-in-telanagana

By

Published : Nov 27, 2021, 9:10 PM IST

పారాబాయిల్డ్ బియ్యం కొనుగోలు(Paddy Procurement in telanagana) చేయబోమని కేంద్ర ప్రభుత్వం, భారత ఆహార సంస్థ నిర్ణయించిన నేపథ్యంలో యాసంగిలో రైతులు వరిసాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, జిల్లా వ్యవసాయ, పౌరసరఫరాలశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష(cs somesh kumar review)లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ మేరకు ప్రకటించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించిన సీఎస్... ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, సంబంధిత అంశాలపై చర్చించారు.

మిల్లర్లతో ఒప్పందాలున్న వాళ్లు వరి వేయొచ్చు..

"పారాబాయిల్డ్ బియ్యం తీసుకోరాదని కేంద్ర ప్రభుత్వం, ఎఫ్​సీఐ నిర్ణయించాయి. రాష్ట్రంలో యాసంగిలో సాగయ్యే వరి పారాబాయిల్డ్ బియ్యానికే అనుకూలం. రైతులు యాసంగిలో వరి సాగు చేయవద్దు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలు చేసుకునే వారు సొంత రిస్క్​తో వరి సాగు చేసుకోవచ్చు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్లు చర్య తీసుకోవాలి. అవసరమైన చోట కొత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కలెక్టర్లు, సీనియర్ అధికారులు కొనుగోలు కేంద్రాలను తరచూ సందర్శించి సమస్యలను పరిష్కరించాలి. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం వస్తున్నట్లు కొన్ని సంఘటనలు వెలుగుచూశాయి. ఇతర రాష్ట్రాల ధాన్యం రాకుండా కలెక్టర్లు, పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలి. అలా రావడం రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. వానాకాలంలో కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్రం తెలిపింది. ధాన్యాన్ని బియ్యంగా మార్చే మిల్లింగ్ ప్రక్రియ కూడా వేగవంతమయ్యేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు బియ్యంగా మార్చి పంపిస్తేనే కొనుగోళ్లకు సరిపడా స్థలం ఉంటుంది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి" - సోమేశ్​కుమార్​, సీఎస్​

ఇబ్బందులు లేకుండా చూసుకోండి..

కామారెడ్డి జిల్లా ధాన్యం కొనుగోళ్ల(Paddy Procurement in telanagana)పై హైదారాబాద్ నుంచి మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇవాళ సెల్​ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు వివరాలను జిల్లా కలెక్టర్ జితేష్​వి పాటిల్​ను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు మూడు లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. బాన్సువాడలో 94 శాతం, జుక్కల్​లో 80 శాతం ధాన్యం కొనుగోలు పూర్తిచేసినట్లు కలెక్టర్ తెలిపారు.

కామారెడ్డి అధికారులతో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇవాళ సెల్​ కాన్ఫరెన్స్

"కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ధాన్యం కొనుగోళ్లు(Paddy Procurement in telanagana)వేగవంతం చేయడానికి బాన్సువాడ, జుక్కల్ ప్రాంతాల నుంచి కాంటాలను, హమాలీలను, లారీలను తెప్పించుకోండి. అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలి. తూకం వేసిన ధాన్యంను వెంటనే రైస్​మిల్​కు తరలించాలి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం స్టాక్ జీరో చేయాలి. వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్​లో ఎంట్రీ చేసి.. రైతులకు డబ్బులు సకాలంలో అందేలా చూడాలి. కొనుగోలు కేంద్రాలకు అవసరమైనన్ని తూకం, తేమశాతం చూసే యంత్రాలు, గోనె సంచులు అందుబాటులో ఉంచాలి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్న ధాన్యం వివరాలు, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి అధికారులకు తెలియజేసేలా చూడాలి. ధాన్యం రవాణాకు సరిపడా వాహనాలను అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ జరిగేలా చూడాలి." - ప్రశాంత్​రెడ్డి, మంత్రి

ఇదీ చూడండి:

  • Revanth in Vari Deeksha: 'వరి కొనకపోతే.. నడిబజార్ల ఉరి తీయటం ఖాయం'

ABOUT THE AUTHOR

...view details