తెలంగాణ

telangana

ETV Bharat / city

Dalitha Bandhu: రూ.500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు - Dalit bandhu scheme funds in huzurabad constituency

Dalitha Bandhuరూ.500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు
Dalitha Bandhuరూ.500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు

By

Published : Aug 9, 2021, 1:02 PM IST

Updated : Aug 9, 2021, 1:37 PM IST

12:59 August 09

Dalitha Bandhu: రూ.500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు

హుజూరాబాద్‌ నియోజకవర్గానికి దళిత బంధు నిధులు విడుదలయ్యాయి.  రూ.500 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల విడుదలతో నియోజకవర్గంలోని ఎస్సీలు సంబురాలు చేసుకుంటున్నారు. తమ ప్రగతి కోసం ఇలాంటి అద్భుత పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. సబ్బండ వర్గాల ఆశాజ్యోతిగా సీఎం కేసీఆర్ మారారని... దళితుల సాధికారత కోసం తీసుకొచ్చిన 'తెలంగాణ దళిత బంధు' పథకాన్ని అణగారిన వర్గాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైక నేత కేసీఆర్ మాత్రమేనని హుజూరాబాద్ నియోజకవర్గ ఎస్సీలు కొనియాడారు.

మొదటగా ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తతగ్రామమైన వాసాలమర్రిలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆ పంచాయతీలో ఉన్న 76 ఎస్సీ కుటుంబాలకు లబ్ధి చేకూరేలా తెలంగాణ దళితబంధు పథకం కింద 7.6 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.

Last Updated : Aug 9, 2021, 1:37 PM IST

ABOUT THE AUTHOR

...view details