ఆర్టీసీ కార్మికుల ఆందోళనలకు విపక్ష నేతలు సైతం సంఘీభావం ప్రకటిస్తున్నారు. చట్టబద్దంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను తొలగించడం అక్రమమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ కుంతియా ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి డిమాండ్లు పరిష్కరించాలన్నారు. 50వేల మంది ఉద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు.
కేసీఆర్ ఎందుకు స్పందించరు..?
ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి రాష్ట్ర ప్రజలకు నష్టం వాటిల్లకుండా చూడాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ నిలదీశారు. ప్రతి అంశంపై ట్విటర్‌లో స్పందించే కేటీఆర్.... ఆర్టీసీ కార్మికుల విషయంలో ఎందుకు ట్వీట్ చేయలేదని ప్రశ్నించారు. తక్షణమే స్పందించకపోతే... రాష్ట్ర ప్రజల దృష్టిలో ద్రోహిగా మిగులుతారన్నారు.
తెరాస పతనం మొదలైంది బండి జోస్యం