తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆర్టీసీ సమస్యపై గవర్నర్​ను కలిసిన విపక్ష నేతలు - tsrtc strike latest news

ఆర్టీసీ సమస్యపై విపక్ష నేతలు రాజ్​భవన్​లో గవర్నర్​ను కలిశారు. సమస్య పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సమస్యపై అవసరం అయితే రాష్ట్రపతి, కేంద్రమంత్రుల వద్దకైనా వెళ్తామని సభ్యులు స్పష్టం చేశారు.

ఆర్టీసీ సమస్యపై గవర్నర్​ను కలిసిన విపక్ష నేతలు

By

Published : Nov 20, 2019, 3:15 PM IST

విపక్ష నేతలు రాజ్​భవన్​లో గవర్నర్ తమిళిసైని కలిసి ఆర్టీసీ కార్మికుల సమస్యలు.. ప్రజలు పడుతున్న ఇక్కట్లను వివరించారు. ఒకప్పుడు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయనని బల్లగుద్ది చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు దానిపై దృష్టి పెట్టారని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ వ్యాఖ్యానించారు. కోర్టు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని.. రాజకీయ వ్యాఖ్యలు చేసిన ఆర్టీసీ ఇన్​ఛార్జి ఎండీ సునీల్ శర్మపై చర్యలు తీసుకోవలని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. వీరితో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మాజీ మంత్రి గీతా రెడ్డి, భాజపా నేత మోహన్ రెడ్డి తదితరులు ఆర్టీసీ సమస్యను గవర్నర్​కు వివరించారు. అవసరం అయితే కార్మికుల సమస్యను రాష్ట్రపతి, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తామని విపక్ష నేతలు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details