ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని అరుంధతిపాలెంలో మురికికాలువ విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఒకరిపై ఒకరి దాడికి దారితీసింది. అరుంధతిపాలెంలో 2 రోజుల క్రితం మురికికాలువ విషయంలో ఎదురెదురు ఇళ్ల వారి మధ్య చిన్న వివాదం ఏర్పడింది. ఈ విషయమై రెండు వర్గాలు పోలీసు స్టేషన్ ఫిర్యాదులు చేసుకున్నారు. పోలీసులు వారి మధ్య సయోధ్య కుదిర్చి ఇళ్లకు పంపారు. అదే విషయమై ఇరువర్గాలు తిరిగి గొడవపడ్డారు. కర్రలతో ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు.
మురికికాలువ విషయంలో వివాదం.. ఇరువర్గాల ఘర్షణ - నెల్లూరు జిల్లా వార్తలు
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అరుంధతిపాలెంలో మురికికాలువ విషయంలో చెలరేగిన వివాదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. గొడవను సర్ధుబాటు చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా.. వారి ముందే రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
మురికికాలువ విషయంలో వివాదం.. ఇరువర్గాల ఘర్షణ
అటుగా వెళ్తున్న పోలీసులు గొడవను సర్దుబాటుచేసేందుకు ప్రయత్నించగా...మాటమాట పెరిగి వివాదం మరింత ముదిరింది. పోలీసుల ఎదుటే బాహాబాహీకి దిగారు. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి :రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 72.49 శాతం