Opponents sets Fire to farm fields: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కురబలకోట మండలం దిగువశితివారిపల్లిలో.. తెదేపా నేతల పొలాలకు కొందరు నిప్పుపెట్టిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కురబలకోట మాజీ మండల అధ్యక్షుడు, తెలుగుదేశం నేత భూమిరెడ్డి, ఆయన తమ్ముడు చంద్రశేఖర్‌రెడ్డి పొలాలకు దుండగులు నిప్పు పెట్టగా తగలబడిపోయాయి. మంటల్లో టమాటా పంటకు ఆసరాగా పెట్టే కర్రలతో పాటు.. బిందుసేద్యం పరికరాలు దగ్ధమయ్యాయి.
విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. సర్పంచ్ ఎన్నికల్లో తమ వర్గానికి చెందిన వ్యక్తి గెలుపొందడంతో.. వైకాపా నేతలు కక్షగట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని.. తెదేపా నేతలు ఆరోపించారు. వైకాపా నేత శంకర్‌రెడ్డే తమ పొలాలకు నిప్పుపెట్టాడని.. అధికార బలంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.