హాథ్రస్ అత్యాచార ఘటనను నిరసిస్తూ గాంధీభవన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే నిరసన వ్యక్తం చేసే విషయంలో మహిళా కాంగ్రెస్‌లో విబేధాలు తెరపైకొచ్చాయి. మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారదకు, మరో పీసీసీ అధికార ప్రతినిధికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువురు నేతలు రెండు వర్గాలుగా విడిపోయి రెండు దిష్టి బొమ్మలను వేర్వేరుగా దగ్ధం చేశారు.
టీపీసీసీలో విబేధాలు.. రెండుగా చీలిన మహిళా కాంగ్రెస్
టీపీసీసీలో మరోసారి విబేధాలు బయటపడ్డాయి. హాథ్రస్ అత్యాచార ఘటనను నిరసిస్తూ గాంధీభవన్ ఎదుట చేపట్టిన కార్యక్రమంలో మహిళా నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. దిష్టిబొమ్మ దగ్ధం విషయంలో విబేధాలు తలెత్తగా సీనియర్ నేత వీహెచ్ జోక్యం చేసుకుని వ్యవహారం సద్దు మణిగించారు.
టీపీసీసీలో విబేధాలు.. రెండుగా చీలిన మహిళా కాంగ్రెస్
దిష్టిబొమ్మల దగ్ధం సమయంలోనే మహిళా నేతలు గొడవకు దిగడంతో... సీనియర్ నేత వి.హనుమంతరావు జోక్యం చేసుకుని వ్యవహారాన్ని సద్దుమణిగించారు. అనంతరం ఎమ్మెల్యే సీతక్కతో కూడిన వర్గం, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద వర్గం వేర్వేరుగా నిరసన కార్యక్రమం కొనసాగించారు.