సైన్స్ పరిశోధనల కేంద్రంలో ఓపెన్ డే - సీసీఎంబీలో ఓపెన్ డే
సీసీఎంబీ.... సైన్స్ పరిశోధనల కేంద్రంగా ప్రజలందరికీ సుపరిచితమే అయినా... దాన్ని సందర్శించే అవకాశం రావటం మాత్రం అత్యంత అరుదనే చెప్పాలి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ ప్రజల సందర్శనకు అనుమతిస్తూ సీసీఎంబీ ఓపెన్ డే కార్యక్రమాన్ని నిర్వహించింది.

సీసీఎంబీలో ఓపెన్ డే... సందర్శనకు అనుమతి
సీసీఎంబీలో ఓపెన్ డే... సందర్శనకు అనుమతి
సెప్టెంబర్ 26న సీఎస్ఐఆర్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా సీసీఎంబీలో ఓపెన్ డే నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రదర్శనలో పరిశోధనల గురించిన అంశాలను సీసీఎంబీ పరిశోధనా విద్యార్థులు సందర్శనార్థం ఉంచారు. వివిధ రకాల చిత్రాలు, నమూనాలు, కంప్యూటర్ త్రీడీ టెక్నాలజీతో వివరించారు. సుమారు 15,000 మంది విద్యార్థులు ఈ ప్రదర్శనను తిలకించి..... శాస్త్ర సాంకేతిక రంగంలో సీసీఎంబీ సాధిస్తున్న విజయాలతోపాటు.. వివిధ రకాల పరిశోధనలు వాటి ఫలితాలను చిట్టి బుర్రలోకి ఎక్కించుకున్నారు.