రాష్ట్రంలోని 38 ప్రముఖ దేవాలయాల్లో ఆన్‌లైన్ పూజలు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అనిల్ కుమార్ వివరించారు. టీ ఫొలియో యాప్, మీ సేవ పోర్టల్లో ఆన్‌లైన్ పూజలను బుక్ చేసుకోవాలని సూచించారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు హనుమాన్, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, బాసర జ్ఞాన సరస్వతి, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సహా పలు దేవాలయాల్లో ఆన్‌లైన్ పూజలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.