తెలంగాణ

telangana

ETV Bharat / city

బ్యాంకుల తరహాలో తపాలా సేవలు.. ఆర్‌బీఐ అనుమతి కోరిన పోస్టల్‌శాఖ - postal accounts increased

ఖాతాదారుల సౌలభ్యం కోసం తన సేవలను మరింత విస్తృతం చేసే దిశగా తపాలాశాఖ అడుగులు వేస్తోంది. కొత్తగా ఖాతాల సంఖ్య పెంచుకునేందుకూ ప్రయత్నిస్తోంది.

postal services like banking
బ్యాంకుల తరహాలో తపాలా సేవలు

By

Published : Oct 31, 2020, 7:58 AM IST

ఖాతాదారుల సౌలభ్యం కోసం తన సేవలను మరింత విస్తృతం చేసే దిశగా తపాలాశాఖ అడుగులు వేస్తోంది. తెలంగాణ సర్కిల్‌ పరిధిలోనే పొదుపు, రికరింగ్‌ డిపాజిట్‌, నెలసరి ఆదాయ పథకం, పీపీఎఫ్‌.. ఇలా అన్నిరకాలు కలిపి ఉన్న కోటి 26 లక్షల ఖాతాదారులను కాపాడుకోవడంతో పాటు, కొత్తగా ఖాతాల సంఖ్య పెంచుకునేందుకూ ప్రయత్నిస్తోంది.

అకౌంట్లలో డబ్బులు ఉంటే చాలు.. షాపింగ్‌ సహా రైలు, విమాన టికెట్ల బుకింగ్‌, ఇతరుల బ్యాంకు ఖాతాలకు బదిలీ, ఇతర అవసరాలకు క్షణాల్లో చెల్లింపులు జరిపే సౌకర్యాన్ని తీసుకురావడంపై దృష్టి సారించింది. ఈ తరహా లావాదేవీల నిర్వహణకు రిజర్వుబ్యాంకు అనుమతి కోరింది. తమ ఖాతాదారులకూ బ్యాంకుల తరహా సేవలను అందించేందుకు రిజర్వుబ్యాంకు నుంచి అనుమతి లభిస్తే తపాలా అకౌంట్లకు మరింత ఆదరణ పెరుగుతుందని భావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details