ఆన్లైన్ లోన్ యాప్‌లకు ప్రజలు బలవుతున్నారు. వీటి బారిన పడుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అత్యవసర సమయంలో నగదు తీసుకున్న వారికి యాప్ నిర్వాహుకులు నరకం చూపెడుతున్నారు.
'మాకు న్యాయం వద్దు... కానీ ఆ యాప్‌లు బ్యాన్ చేయండి' - online money apps should be banned
ఆన్లైన్ లోన్ యాప్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక పలువురు ఆత్మహత్యకు పాల్పడుతుండగా.. మరికొందరు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
ఆన్లైన్ లోన్ యాప్ బాధితులు
యాప్‌ల నుంచి రుణం తీసుకుంటే 20 నుంచి 30 శాతం వరకు అధిక వడ్డీ వేసి చెల్లించాలని వేధిస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెల్లించలేని స్థితిలో ఫోన్ చూసి అసభ్యకరంగా తిడుతున్నారని వాపోతున్నారు. యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక పలువురు ఆత్మహత్యకు పాల్పడ్డారని, దిక్కులేక తాము పోలీసులను ఆశ్రయించామని తెలిపారు. తమకు న్యాయం జరగపోయినా పర్వాలేదు కానీ.. ఆన్లైన్ లోన్ యాప్‌లను బ్యాన్ చేయాలని కోరుతున్నారు.
- ఇదీ చూడండి :మాటలతో ఉబ్బిస్తూ.. ఖాతాల్లో ఊడ్చేస్తూ..!