ఆన్లైన్లో హాస్టల్‌ను బుకింగ్ చేసుకునే అవకాశాన్ని థింక్ వైడ్ హాస్పిటాలిటీ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ కస్టమర్ల కోసం ఇప్పుడు కొత్తగా ప్రైమ్ మెంబర్‌షిప్‌ను లాంచ్ చేసింది. హాస్టల్, వసతి ప్రాంతాలను గుర్తించి తెలియజేసే టెక్నాలజీ స్టార్టప్‌గా పీజీవో ప్రారంభమైంది. నేడు వేలాది హాస్టళ్లు, పీజీలతో కలిసి పనిచేస్తూ... దేశవ్యాప్తంగా లక్షలాది వేలాది కస్టమర్లను సంపాదించుకుంది. ఎలాంటి శ్రమ లేకుండా పీజీవో యాప్‌లో హాస్టళ్లు, పీజీల... రివ్యూలు, ఫొటోలు చూసి బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది థింక్ వైడ్ సంస్థ.
2 మిలియన్ డాలర్ల పెట్టుబడి
పీజీవోకు మరో 2మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకొచ్చారు. ఎక్తా సంస్థ శ్రీని ముసాని, ఐఆర్ఏ రియాలిటీ సంస్థ నర్సిరెడ్డి పోషం సంయుక్తంగా పెట్టుబడి పెడుతున్నట్లు సంస్థ ఫౌండర్ సీఈఓ హరికృష్ణ ప్రకటించారు. పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నందున... ఆన్లైన్లో పీజీల కోసం వెతికే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అలాంటి వారికి ఎలాంటి రిస్క్ లేకుండా చక్కని పీజీలను అందించటమే పీజీఓ లక్ష్యమని వారు తెలిపారు.
ఆన్లైన్లో హాస్టల్ బుకింగ్... అందులోనూ డిస్కౌంట్ ఇదీ చూడండి: సకల సౌకర్యాలతో పునరావాసం... స్థానికుల్లో సంతోషం