తెలంగాణ

telangana

By

Published : Apr 7, 2021, 6:52 PM IST

ETV Bharat / city

రూ.3099 చెల్లిస్తే... రెండు బట్టల సబ్బులు పంపించారు!

ఆన్​లైన్​లో హార్డ్​డిస్క్ కోసం ఆర్డరిచ్చిన యువకుడికి పార్శిల్ వచ్చింది. పార్శిల్ తీసుకునే ముందే నగదు చెల్లించాడు. తీరా ఓపెన్ చేసి చూస్తే అందులో హార్డ్​డిస్క్ బదులు, రెండు బట్టల సబ్బులున్నాయి. అది చూసి ఖంగుతిన్న సదరు యువకుడు ఇదేంటని పార్శిల్ కేంద్రం వారిని అడగ్గా తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. చేసేది లేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన ఏపీ కడప జిల్లా రెడ్డయ్య మఠంలో జరిగింది.

online
రెండు బట్టల సబ్బులు

రెండు బట్టల సబ్బులు

ఏపీ కడప జిల్లా బద్వేలు పట్టణంలో రెడ్డయ్యమఠానికి చెందిన ప్రదీప్ ల్యాప్​టాప్​ హార్డ్​డిస్క్ కోసం ఆన్​లైన్​లో వెతికాడు. అమెజాన్​లో ఒక హార్డ్​డిస్క్ నచ్చి ఆర్డర్ పెట్టాడు. పార్శిల్ ఇంటికి రాగానే రూ.3,099 నగదు చెల్లించాడు. పార్శిల్ ఓపెన్ చేసే క్రమాన్ని వీడియో చిత్రీకరణ చేశాడు.

అందులో హార్డ్​డిస్క్ బదులు రూ.10 విలువ చేసే రెండు బట్టల సబ్బులను చూసి ప్రదీప్ ఖంగుతిన్నాడు. వెంటనే పార్శిల్​ను సంబంధిత పార్శిల్ కేంద్ర నిర్వాహకుల వద్దకు తీసుకువెళ్లి ప్రశ్నించాడు. తమకు సంబంధం లేదని నిర్వాహకులు చెప్పటంపై బాధితుడు పట్టణ పోలీసులను ఆశ్రయించాడు.

ఇదీ చదవండి:యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన మహోత్సవం

ABOUT THE AUTHOR

...view details