ఏటీఎం కార్డు మాదిరిగా ఉండే పాలి వినైల్ క్లోరైడ్ అనే ప్లాస్టిక్ కార్డును యుఐడీఏఐ అందుబాటులోకి తెచ్చింది. గత నెల 25 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. డెబిట్, క్రెడిట్ కార్డుల మాదిరినే దీనిని కూడా ప్యాకెట్‌లో భద్రపరచుకుని అవసరమైన చోట ఉపయోగించుకునేందుకు వీలుంటుంది. ఏ అవసరానికి అయినా... జిరాక్స్ కాపీ కావాల్సి వస్తే వెంటనే ఇచ్చేందుకు అనువుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
పీవీసీ ఆధార్‌కార్డు కోసం వెల్లువెత్తుతున్న ఆన్‌లైన్ దరఖాస్తులు
నిత్యావసరాల్లో ఆధార్ కార్డు ఒకటైంది. ప్రభుత్వ, ప్రైవేటు పథకాల అమలు, బ్యాంకు రుణాలు, సిమ్ కార్డు కావాలన్న... ప్రతీ అవసరానికి ఆధార్ కార్డు ఆధారమవుతోంది. ఆధార్ కార్డు ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతుండడం వల్ల భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ-యుఐడీఏఐ ఏటీఎం కార్డును పోలిన పీవీసీ ఆధార్ కార్డును ప్రవేశ పెట్టింది.
online applications for pvc aadhar cards
పీవీసీ కార్డు తీసుకోవాలన్న డిమాండ్ యుఐడీఏఐ అధికారులు స్పష్టం చేశారు. అవసరమనుకున్న వారు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని రూ.50 లు చెల్లిస్తే వారం, పది రోజుల్లో స్పీడ్ పోస్టు ద్వారా కార్డులోని చిరునామాకు చేరిపోతుంది. చూడడానికి చక్కగా ఉండడం... వెంట తీసుకెళ్లడానికి అనువుగా ఉండడం వల్ల విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఈ పీవీసీ కార్డు కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేస్తున్నారని యుఐడీఏఐ అధికారులు తెలిపారు.