తెలంగాణ

telangana

ETV Bharat / city

'మృతి చెంది మూడ్రోజులైనా.. బంధువులకు సమాచారమివ్వ లేదు'

ఓ వ్యక్తి చనిపోయి మూడ్రోజులైనా.. ఆ విషయం బంధువులకు తెలియజేయకుండా ఏపీలోని ప్రకాశం జిల్లా రిమ్స్​ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. దీనిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగి పరిస్థితిపై తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని వాపోయారు. సదరు వ్యక్తి కరోనాతో మరణించాడా.. మరే ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయాడా అనేది తెలియాల్సి ఉంది.

ap corona news
మూడు రోజుల క్రితమే మృతి.. బంధువులకు సమాచారమివ్వని సిబ్బంది

By

Published : Jul 23, 2020, 11:35 PM IST

ఓ వ్యక్తి చనిపోయి మూడ్రోజులైనా.. ఆ విషయం బంధువులకు తెలియజేయకుండా ఏపీలోని ప్రకాశం జిల్లా రిమ్స్​ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. కురిచేడుకు చెందిన వెంకయ్య ఈనెల 19న జ్వరంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు. ఆస్పత్రి సిబ్బంది అతనికి కరోనా పరీక్షలు చేసి, జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మార్కాపురంలోని కొవిడ్ ఆస్పత్రికి రిఫర్​ చేశారు. అక్కడ కూడా జ్వరం అదుపులోకి రాకపోవడం వల్ల ఒంగోలు రిమ్స్​కు తరలించారు. బాధితుడు అక్కడ చికిత్స పొందుతూ.. ఈనెల 21న మృతి చెందాడు. ఈ విషయం మృతుడి కుటుంబ సభ్యులకు.. ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇవ్వలేదు.

వెంకయ్య బంధువులు అతని యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఆస్పత్రికి వెళ్లి విచారించారు. అక్కడి సిబ్బంది మూడురోజుల క్రితమే బాధితుడు చనిపోయినట్లు చెప్పారు. నిర్ఘాంతపోయిన బంధువులు.. ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంకయ్య.. కరోనా నెగిటివ్​గా వచ్చినట్లు స్థానిక వైద్యాధికారి తెలిపారు. అయితే వెంకయ్య కరోనాతో మృతి చెందాడా? లేకా ఇంకేమైనా అనారోగ్య సమస్యలతో మరణించాడా? అనేది తెలియాల్సి ఉంది. వెంకయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఇవీచూడండి:రాష్ట్రంలో 50 వేలు దాటిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details