ఏపీలో ఉద్ధృతంగా అమరావతి రైతుల ఆందోళన - amaravathi news updates
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... ఆంధ్రప్రదేశ్ రైతులు, మహిళలు చేస్తున్న నిరసన దీక్షలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు అంటూ నినాదాలు చేశారు.
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... ఏపీలోని గ్రామాల్లో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. వెలగపూడి, నీరుకొండ, నేలపాడు, ఎర్రబాలెం, వెంకటపాలెం, పెదపరిమి, అబ్బిరాజుపాలెంలో రైతులు, మహిళలు ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కృష్ణాయపాలెం, మందడంలో నిరసన చేస్తున్న రైతులు... మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపం తెలిపారు. రాజధాని పోరాటంలో పాల్గొని మృతిచెందిన రైతుల కుటుంబసభ్యులకు తెనాలికి చెందిన ఎన్నారై బాలకృష్ణ... రూ. నాలుగువేలు అందించారు. అబ్బిరాజుపాలెంలో హనుమాన్ చాలీసా చదువుతూ నిరసన దీక్షలో పాల్గొన్నారు.