ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది.
వివరాలు...
* ఓఎన్‌జీసీ మెరిట్ స్కాలర్‌షిప్పులు
మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 1000
- విభాగాలవారీ ఖాళీలు: ఇంజినీరింగ్-494, ఎంబీబీఎస్-90, ఎంబీఏ-146, మాస్టర్ డిగ్రీ (జియాలజీ/ జియోఫిజిక్స్)-270.
- వ్యవధి: ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరినవారికి నాలుగేళ్లు; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ కోర్సుల్లో చేరినవాళ్లకు రెండేళ్ల పాటు అందిస్తారు.
- ఆర్థిక ప్రోత్సాహం: నెలకు రూ.4000
- అర్హత: ఇంజినీరింగ్/ ఎంబీబీఎస్, ఎంబీఏ, మాస్టర్ డిగ్రీ (జియాలజీ/ జియోఫిజిక్స్) కోర్సుల్లో ప్రస్తుతం ప్రథమ సంవత్సరంలో చేరి ఉండాలి.
- వయస్సు: 30 ఏళ్లు మించకూడదు.
- ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా.
- దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
- చివరితేది: అక్టోబరు 15
- ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: డిసెంబరు 10
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులు దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: DGM(HR), ONGC, 7th Floor, East Wing, CMDA Tower-I, No.1,Gandhi Irwin Road, Egmore, Chennai - 600 008.