ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో కేవలం ఒక్క ఓటు సర్పంచ్ అభ్యర్థి విజయాన్ని మార్చేసింది. మండలంలోని కందలంపాడు సర్పంచ్‌గా బైరెడ్డి నాగరాజు విజయం సాధించారు. ప్రత్యర్థి మొవ్వ సుబ్రహ్మణ్యంపై గెలుపొందారు. అతిచిన్న గ్రామం కావడంతో 203 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వీటిలో నాగరాజుకు 102, సుబ్రహ్మణ్యంకు 101 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ చేసినా అదే ఫలితం రావడంతో అధికారులు నాగరాజును సర్పంచ్‌గా ప్రకటించారు.
అదే మండలంలోని జగన్నాథపురంలో పిన్నిబోయిన శ్రీనివాసరావు మూడు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.