పాఠశాలకు విద్యార్థులు రావడానికి ఆ ఉపాధ్యాయురాలు ఆసక్తి అంతా ఇంతా కాదు. పిల్లల తల్లితండ్రులకు విద్యపట్ల అవగాహన కల్పించి వారు పాఠశాలకు వచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం, బందలాయి చెరువులోని ప్రభుత్వ పాఠశాలలో జె.పద్మావతి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. పద్మావతిని అందరూ రూపాయి టీచర్ అని ముద్దుగా పిలుస్తారు. అంటే రూపాయి తీసుకుని... చదువు చెబుతారని కాదు. రోజూ పిల్లలకు రూపాయి ఇచ్చి విద్యాబుద్ధులు నేర్పుతారు. గతంలో అవనిగడ్డ మండలం గుడివాకపాలెం పాఠశాలలో పనిచేసిన పద్మావతి... బడిలో ఆరుగురు విద్యార్థులు ఉండటాన్ని గమనించారు.
ఎలాగైనా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఓ మంచి ఆలోచన పద్మావతికి తట్టింది. పిల్లల పేరు మీద ఆర్డీ అకౌంట్ తెరిచి... ప్రతి విద్యార్థి పేరు మీద రోజుకు రూపాయి చొప్పున నెలకు 30 రూపాయలు జమచేయాలని భావించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి తమ పిల్లలను... పాఠశాలలో చేర్పించాలని కోరారు. దీంతో పద్మావతి మీద నమ్మకంతో తల్లిదండ్రులు.. తమ పిల్లలను బడిలో చేర్పించారు. అలా ఆరుగురు కాస్త 45 మంది విద్యార్థులయ్యారు.
జీతంలో 30శాతం విద్యార్థుల కోసం