ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖ విషవాయువు ఘటన సమీప ప్రాంత ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో అస్వస్థతకు గురై కోలుకుని ఇంటికి వచ్చిన వారు మళ్లీ జబ్బు పడుతున్నారు. ఆర్.ఆర్.వెంకటాపురం వాసి వెంకాయమ్మ ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయింది. కానీ ఆమె పూర్తిగా కోలుకోలేదు. మళ్లీ అస్వస్థతకు గురై నాలుగు రోజుల క్రితం కేజీహెచ్‌లో చేరింది.
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మరో మహిళ మృతి
ఏపీలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది మృతి చెందగా.. పలువురు ఆస్పత్రిపాలయ్యారు. ఇంకా సమీప గ్రామాల ప్రజలు కోలుకోలేదు. ఆర్.ఆర్ వెంకటాపురానికి చెందిన మహిళ మళ్లీ అస్వస్థతకు గురై నాలుగు రోజుల క్రితం కేజీహెచ్‌లో చేరింది. చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఎల్జీ పాలిమర్స్ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మరో మహిళ మృతిగ్యాస్ లీక్ ఘటనలో మరో మహిళ మృతిఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మరో మహిళ మృతి
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి వెంకాయమ్మ(84) మృతి చెందింది. వెంకాయమ్మ మృతిపై గోపాలపట్నం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో అస్వస్థతకు గురైన వెంకాయమ్మ గతంలో ప్రభుత్వం నుంచి రూ.లక్ష పరిహారం పొందింది.
ఇవీ చూడండి:కరోనా వేళ కూలీల ఆశాదీపం 'ఉపాధిహామీ'