ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. స్వీడన్ నుంచి విజయవాడ వచ్చిన 28 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా ధ్రువీకరణ అయినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఈనెల 18న స్వీడన్ నుంచి దిల్లీకి వచ్చిన వ్యక్తి... అదే రోజు రాత్రి విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. కారులో ఇంటికి వెళ్లిన అతను ఈనెల 25న వైరస్ అనుమానిత లక్షణాలతో విజయవాడ జీజీహెచ్లో చేరారు. నమునాలు పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. మొత్తంగా 29 మందికి సంబంధించిన నమూనాలు పరీక్షిస్తే 28 మందికి నెగెటివ్ వచ్చింది. మరో 32 మంది నమూనాలకు సంబంధించి ఫలితాలు వెల్లడికావాల్సిఉందని వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. కాగా ఇప్పటి వరకు 12 మందికి వైరస్ సోకింది.
ఏపీలో మరో పాజిటివ్ కేసు..12కు చేరిన బాధితులు - corona news latest news
విదేశాల నుంచి విజయవాడ వచ్చిన 28 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లుగా అధికారులు గుర్తించారు. ఇంకా 29 మంది అనుమానితుల రిపోర్ట్.. పరీక్షా కేంద్రాల నుంచి రావాల్సి ఉంది. దీనిపై వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
విజయవాడ