తెలంగాణ

telangana

ETV Bharat / city

రోడ్డుపక్కన నెలన్నర పసికందు... చేరదీసిన పోలీసులు

ఎంత కష్టమొచ్చిందో.. ఏం జరిగిందో... ఓ తల్లి తన కన్నబిడ్డను రోడ్డు పక్కన వదిలి వెళ్లింది. ఆ నెలన్నర పసికందును పోలీసులు చేరదీసి... నామకరణం చేశారు. చివరికి శిశు విహార్​​లో చేర్చారు. ఈ ఘటన హైదరాబాద్​ కూకట్​పల్లిలో జరిగింది.

రోడ్డుపక్కన నెలన్నర పసికందు... చేరదీసిన పోలీసులు
రోడ్డుపక్కన నెలన్నర పసికందు... చేరదీసిన పోలీసులు

By

Published : Oct 22, 2020, 9:27 PM IST

నవమాసాలు మోసి.. కనీ.. నెల రోజుల పాటు పెంచిన ఓ తల్లి తన కన్న బిడ్డను రోడ్డు పక్కన వదిలివెళ్లిపోయింది. ఈ ఘటన హైదరాబాద్​ కూకట్​పల్లి పోలీస్​స్టేషన్ పరిధిలోని కైతలాపూర్​లో చోటు చేసుకుంది. కైతలాపూర్ పెట్రోల్ పంపు సమీపంలో గురువారం ఉదయం 11 గంటల సమయంలో గుర్తు తెలియని మహిళ నెలన్నర వయసున్న పసికందును వదిలి వెళ్ళింది.

రోడ్డుపక్కన నెలన్నర పసికందు... చేరదీసిన పోలీసులు

స్థానికులు పాప ఏడుపును గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పెట్రోలింగ్ మొబైల్ వాహనం ఘటనా స్థలానికి చేరుకొని పాపను కూకట్​పల్లి పోలీస్ స్టేషన్​కు తరలించారు. స్టేషన్​లో మహిళా పోలీసులు పాపను శుభ్రపరిచి పాలు తాగించిన అనంతరం సీఐ లక్ష్మీనారాయణ పాపకు ఇందిర అని నామకరణం చేశారు. పాపను చేరదీసి శిశు విహార్​లో చేర్పించారు.

ఇదీ చూడండి: దీక్షిత్ కథ విషాదాంతం... గుండెలవిసేలా రోదించిన పేగుబంధం

ABOUT THE AUTHOR

...view details