రాష్ట్రంలో ఏడాదికి 4 లక్షల శుక్లం(కాటరాక్ట్) శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని, వీటిలో 25 వేలు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇక నుంచి వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఏడాదికి కనీసం లక్ష శుక్లం ఆపరేషన్లు జరిగేలా లక్ష్యం పెట్టుకోవాలని ఆదేశించారు. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల పనితీరుపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
ఏటా లక్ష శుక్లం శస్త్రచికిత్సలు చేయాలి: హరీశ్‌రావు - cataract surgeries
ఇక నుంచి వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఏడాదికి కనీసం లక్ష శుక్లం ఆపరేషన్లు జరిగేలా లక్ష్యం పెట్టుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ప్రతివారం ప్రతి పీహెచ్‌సీలో కంటి పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స అవసరమైన వారిని ప్రాంతీయ ఆసుపత్రులకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ఆసుపత్రి ప్రసవాలు 97 శాతం నుంచి 99.9 శాతానికి పెరిగాయి. సిజేరియన్లను 61 శాతం నుంచి 58 శాతానికి తగ్గించగలిగాం. మరో 20 శాతం తగ్గించాలి. ఆరోగ్యశ్రీ చికిత్సలు పెరగాలి. డయాలసిస్ రోగులకు ఇబ్బంది లేకుండా సేవలు అందించాల’’ని సూచించారు. సమీక్షలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేతామొహంతి, టీఎస్‌ఎంఐడీసీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్, డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి, డీహెచ్ జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:‘మత్తు’పై ఉత్తుత్తి పోరాటం.. నేరాలు తీవ్రం.. శిక్షలు శూన్యం!