తెలంగాణ

telangana

ETV Bharat / city

ఓ వైపు టీకా పరిశోధన.. మరోవైపు ట్యాగ్ అమ్మకాలు.. - Prakasham latest news

కరోనాతో ప్రజలు భయపడుతుంటే వారి భయం మరికొంత మందికి వరంగా మారింది. అది ఎలానో మీరే చూడండి. రూ.రెండు వందలు ఖర్చు చేస్తే వైరస్ మీ చెంతకు చేరదు అంటూ షట్ ఔట్ పేరుతో ఏపీ ప్రకాశం జిల్లా చీరాలలో ట్యాగులు అమ్ముతున్నారు.

ఓ వైపు టీకా పరిశోేధన.. మరోవైపు ట్యాగ్ అమ్మకాలు
ఓ వైపు టీకా పరిశోేధన.. మరోవైపు ట్యాగ్ అమ్మకాలు

By

Published : Jul 28, 2020, 9:30 PM IST

కరోనా భయం కొంతమందికి వరంగా మారింది. రూ.రెండొందలు ఖర్చు పెట్టండి నెల రోజులు కొవిడ్ వైరస్ మీ జోలికిరాదు అంటూ మార్కెట్లోకి కరోనా వైరస్ షట్ ఔట్ పేరుతో ట్యాగులు వచ్చాయి. ఏపీ ప్రకాశం జిల్లా చీరాలలోని కొన్ని ఔషధ దుకాణాల్లో ఈ అమ్మకాలు సాగుతున్నాయి. ఒక్కొక్కటి 150 రూపాయల నుంచి 200 వరకు అమ్ముతున్నారు. వీటిని కొనుగోలు చేస్తున్న ప్రజలు మెడలో వేసుకుని తిరుగుతున్నారు.

ఓ వైపు టీకా... మరోవైపు ట్యాగ్

ఒక పక్క కరోనా మహమ్మారికి టీకా కనిపెట్టే పనిలో బయో సంస్థలు నిమగ్నమైతే.. ఈ ట్యాగ్ ధరిస్తే కరోనా రాదు అని తప్పుడు ప్రచారాలు సాగుతున్నాయి. ట్యాగ్ కవర్​పై మేడిన్ జపాన్ అని ఉంది. విజయవాడ నుండి తీసుకొచ్చి అమ్ముతున్నామని అమ్మకందారులు చెబుతున్నారు.

ఇవీ చూడండి : ఏ చావైనా.. కొవిడ్​ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details