Andhra Pradesh Omicron Cases: ఆంధ్రప్రదేశ్‌లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదు - తెలంగాణ వార్తలు
12:08 December 22
ఆంధ్రప్రదేశ్‌లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదు
Andhra Pradesh Omicron Cases: ఆంధ్రప్రదేశ్‌లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన మహిళలో ఒమిక్రాన్‌ను గుర్తించారు. ఈనెల 12 నుంచి కెన్యా నుంచి చెన్నై వచ్చిన 39 ఏళ్ల మహిళ... అక్కడి నుంచి తిరుపతి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 12న మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధరణ కాగా... శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్‌కు పంపారు. జీనోమ్ సీక్వెన్స్‌లో మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు బుధవారం ప్రకటించారు. ఒమిక్రాన్ బాధితురాలి కుటుంబసభ్యులకు నెగిటివ్‌గా నిర్ధరణ అయింది.
ఈనెల 12న తొలి కేసు..
ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఒమిక్రాన్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చేసింది. తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు ఈనెల 12 వైద్యశాఖ అధికారికంగా ప్రకటించింది. 34 ఏళ్ల వ్యక్తికి ఈ వేరియంట్ నిర్ధరణ అయింది. బాధితుడు ఆరోగ్యవంతంగా ఉండడం యంత్రాంగానికి ఊరటనిచ్చింది. విదేశాల నుంచి వచ్చిన ఆ యువకుడిని కలిసిన వారికీ వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులపై నిఘా పెంచారు.
ఇదీ చదవండి:కరోనాతో అగ్రరాజ్యం విలవిల.. ఒక్కరోజే 1.81 లక్షల కేసులు