Blast in Hyderabad: హైదరాబాద్లోని ఓ ఇంట్లో పేలుడు - కూకట్పల్లిలో పేలుడు
15:35 January 14
హైదరాబాద్లోని ఓ ఇంట్లో పేలుడు
Blast in Hyderabad: భోగి పండుగ వేళ ఓ ఇంట్లో విషాదం నెలకొంది. హైదరాబాద్ కూకట్‌పల్లి వెంకట్రావునగర్‌లోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఫ్రిజ్ కంప్రెషర్ నుంచి లీకైన గ్యాస్ వల్ల పేలుడు చోటుచేసుకొంది.
వెంకట్రావునగర్లో విజయలక్ష్మి అనే మహిళ తన కుమారుడితో కలిసి నివాసం ఉంటోంది. ఇవాళ మధ్యాహ్నం ఇంట్లో పూజ చేస్తుండగా.. ఫ్రిజ్ నుంచి గ్యాస్ లీకై పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంట్లోని తలుపు, కిటికీలు ధ్వంసమయ్యాయి. మహిళ ముఖంపై గాయాలయ్యాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదీచూడండి:పూల మార్కెట్లో బాంబు కలకలం- దగ్గరుండి పేల్చేసిన ఎన్ఎస్జీ