తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. వృద్ధురాలిని పంపించేందుకు చొరవ.. - సరస్వతీబాయి కథనం

సొంతూరుకు వెళ్తున్నాననే ఆనందం ఆ వృద్ధురాలిని చిన్నపిల్లను చేసింది. సంతోషంతో మాటలే రాని వేళ ఆనందభాష్పాలతో సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. లాక్​డౌన్ కారణంగా 3 నెలలు సొంత ఊరికి, అయినవాళ్లకు దూరమైన ఆ 'అవ్వ'.. అధికారుల చొరవతో స్వగ్రామానికి బయలుదేరింది.

ఈటీవీ భారత్ కథనానికి స్పందన
ఈటీవీ భారత్ కథనానికి స్పందన

By

Published : Jul 3, 2020, 3:52 PM IST

హైదరాబాద్​ నుంచి దుర్గమ్మ దర్శనం కోసం విజయవాడ వెళ్లి లాక్​డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన వృద్ధురాలు ఎట్టకేలకు స్వగ్రామానికి బయలుదేరింది. భాగ్యనగరానికి చెందిన సరస్వతీబాయి 3 నెలల క్రితం విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లింది. లాక్​డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయింది. ఆమె పరిస్థితిపై ఈనాడు, ఈటీవీ భారత్​ కథనం ప్రచురించాయి.

అధికారుల స్పందన

సరస్వతీబాయి పరిస్థితిపై రైల్వే అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్పందించారు. రైల్వే లాకరులో ఉన్న లగేజీని విజయవాడ రైల్వేస్టేషన్ డైరెక్టర్ సురేశ్ వృద్ధురాలికి ఇప్పించారు. శిశు సంక్షేమ కమిటీ ఛైర్మన్ బీవీఎస్ భాస్కర్ శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరేందుకు గోల్కొండ్ ఎక్స్​ప్రెస్​కు టికెట్ తీసిచ్చారు. సొంతూరుకు వెళ్తున్నాననే ఆనందం ఆ వృద్ధురాలిని చిన్నపిల్లను చేసింది. ఆనందభాష్పాలతో తనకు సహాయం అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపి సంతోషంగా బయలుదేరింది.

ఇదీ చదవండి:దుర్గమ్మ దర్శనానికి వచ్చి చిక్కుకుపోయిన పెద్దమ్మ

ABOUT THE AUTHOR

...view details