AP Minister Roja : 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం సిరుగురాజుపాలెంలో పర్యటించిన ఏపీ మంత్రి రోజా.. ఓ వృద్ధుడిని పలకరించారు. పింఛన్ వస్తోందా అని ఆరా తీశారు. వస్తోందని సమాధానమిచ్చిన వృద్దుడు రోజాకు ఓ వింత విజ్ఞప్తి చేశాడు.
'ఒంటరిగా ఉంటున్నా.. నాకు పెళ్లి చేయండి'.. ఓ వృద్ధుడి వింత విజ్ఞప్తి - AP minister roja latest news
'గడప గడపకూ మన ప్రభుత్వం' అంటూ ప్రజల వద్దకు వెళ్లిన ఏపీ మంత్రి రోజాకు.. వింత విజ్ఞప్తి వచ్చింది. పింఛన్ వస్తోందా అని ఓ వృద్ధుడిని మంత్రి పలకరించగా.. వస్తోందని సమాధానమిచ్చాడు. అనంతరం తాను ఒంటరిగా ఉంటున్నానని, తన కోసం ఓ పెళ్లి కుమార్తెను చూడాలని మంత్రిని కోరారు.
తాను ఒంటరిగా ఉంటున్నానని, తన కోసం ఓ వధువును చూడాలని మంత్రి రోజాను కోరారు. వృద్ధుడి వింత విజ్ఞప్తితో రోజా అవాక్కయ్యారు. పక్కనే ఉన్న వృద్ధులు కూడా.. అవును మేడం.. అతడికి నా అన్న వాళ్లెవ్వరూ లేరు.. వృద్ధాప్యంలో చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఓ తోడును చూడండి అంటూ ఆ వృద్ధుడికి వంత పాడారు. వారి మాటలు విన్న మంత్రి రోజా... 'పింఛను అయితే ఇవ్వగలం గానీ... పెళ్లి ఎక్కడి నుంచి చేస్తాం' అంటూ అక్కడి నుంచి నవ్వుతూ వెళ్లిపోయారు. మూడ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇవీ చూడండి :మైనర్లకు మద్యం అమ్మకం.. బార్లకు దిమ్మతిరిగే షాక్
TAGGED:
Minister Roja at nagari