తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈ పెద్దాయన ముక్కుతో ఫ్లూటు ఊదితే... మనసుకు కవ్వింతే! - ap news today

సంగీతానికి పులకించని ప్రాణి ఉండదంటే అతిశయోక్తి కాదు. మధరమైన గానంతో ఆకట్టుకునేవారు కొందరైతే.... ఆ గానానికి వాద్య మేళవింపునిచ్చి ఆనందాన్ని నింపేవారు ఇంకొందరు. అలాంటి కోవకే చెందిన ఈ వృద్ధుడు వినూత్నంగా పిల్లనగ్రోవి వాయిస్తూ ఆకట్టుకుంటున్నాడు. 83ఏళ్ల వయసులోనూ సంగీతప్రియులను అలరిస్తున్నారు.

old man blowing flute with nose at prakasham district
ఈ పెద్దాయన ముక్కుతో ఫ్లూటు ఊదితే... మనసుకు కవ్వింతే!

By

Published : Jan 16, 2020, 7:23 AM IST

ఈ పెద్దాయన ముక్కుతో ఫ్లూటు ఊదితే... మనసుకు కవ్వింతే!

కళల్లో సంగీతానికి ఉండే ప్రత్యేకతే వేరు. అందుకే తరాలు మారుతున్నా ప్రజల ఆదరణ చూరగొంటూనే ఉంది సంగీతం. అలా సంగీతంపై ఇష్టంతో పిల్లనగ్రోవిని వాయిస్తూ... ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం మూలగానివారిపాలేనికు చెందిన 83 ఏళ్ల వృద్ధుడు అక్కల వీరస్వామిరెడ్డి.. అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇంత వయసులోనూ ముక్కుతో పిల్లనగ్రోవిని వాయిస్తూ.. సప్త స్వరాలను అద్భుతంగా పలికిస్తూ.. ఔరా అనిపిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా సన్నని వెదురుబొంగులతో సుమారు 14, 24 అంగుళాలు ఉన్న రెండు పిల్లనగ్రోవులను సొంతంగా తయారు చేశారు. ఆ రెండిట్లో నాగ స్వరాలు పలికిస్తూ.... అబ్బురపరుస్తున్నారు.

వీరస్వామికి నాటకాలపై మక్కువ ఎక్కవ. ఆ అభిరుచిని కొనసాగిస్తూనే.. పిల్లనగ్రోవిని వాయిస్తున్నారు. నాదస్వరం వినిపించి శ్రోతలను ఆకట్టుకుంటున్నారు. వయసు పెరుగుతున్న కారణంగా శ్వాసకోస సమస్యల ఎదుర్కొని.. ఇప్పటికి ఐదు సార్లు శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయినా.. పిల్లనగ్రోవి ఊదడంపై అసక్తితో కొనసాగిస్తూనే ఉన్నారు. సంక్రాంతి సెలవులకు వచ్చిన బంధువులు ఈయన ముక్కుతో చేసే వేణుగాణం విని ఎంతో సంతోషించారు.

తనకు శక్తి ఉన్నంత వరకూ ముక్కుతో పిల్లనగ్రోవిని వాయిస్తునే ఉంటానని వీరస్వామిరెడ్డి చెప్పారు.

ఇదీ చదవండి:రాజధాని సమస్య 29 గ్రామాలకే కాదు... రాష్ట్రం మొత్తానిది: జేసీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details