హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు పాతబస్తీ చార్మినార్ సమీపంలో ఓ పురాతన ఇంటి పై అంతస్తు గోడ కూలిపోయింది. ఆ ఇంటి కింద ఉన్న దుకాణంతోపాటు ఓ కారు ధ్వంసం అయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
కూలిన పురాతన ఇంటి గోడ.. తప్పిన ప్రమాదం
హైదరాబాద్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎడతెరపిలేకుండా వర్షాలు కురవడంతో శిథిలావస్థకు చేరిన ఇళ్లు, భవనాలు కుప్పుకూలుతున్నాయి. చార్మినార్ సమీపంలో ఓ పురాతన ఇంటి గోడ కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
కూలిన పురాతన ఇంటి గోడ.. తప్పిన ప్రమాదం
శిథిలావస్థలో ఉన్న గోడలు ప్రమాదకరంగా మారడంతో అటుగా వెళ్లే ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఎడతెరపిలేకుండా వర్షాలు కురవడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: భారీ వర్షాల ఎఫెక్ట్: పాతబస్తీ ఆగమాగం