తెలంగాణ

telangana

ETV Bharat / city

పన్ను కట్టకుంటే ఇంటికి తాళం గ్యారెంటీ.. - నందిగామలో పన్నులు చెల్లించనివారి ఆస్తులను సీజ్​ చేస్తున్న అధికారులు

కృష్ణా జిల్లా నందిగామ పంచాయతీ పరిధిలో పన్నులు చెల్లించనివారి ఇళ్లు, విద్యా, వ్యాపార సంస్థలను అధికారులు సీజ్​ చేస్తున్నారు. మధిర రోడ్డులోని ఓ కళాశాల రూ.17 లక్షల పన్ను బకాయి చెల్లించలేదని ప్రధాన గేటుకు తాళం వేశారు. అధికారుల తీరుపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Seized untaxed homes
Seized untaxed homes

By

Published : Mar 23, 2022, 3:37 PM IST

Updated : Mar 23, 2022, 4:01 PM IST

ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా నందిగామ నగర పంచాయతీ పరిధిలో పన్నులు చెల్లించనివారి ఇళ్లు, విద్యా, వ్యాపార సంస్థలను అధికారులు సీజ్ చేస్తున్నారు. నందిగామ మధిర రోడ్డులోని కళాశాల రూ.17 లక్షల పన్ను బకాయి కట్టలేదని.. కాలేజీ ప్రధాన గేటుకు తాళాలు వేసి సీలు వేశారు. ఓ కోల్డ్ స్టోరేజ్​కు రూ.7లక్షల పన్ను బకాయి ఉండటంతో దానికీ సీలు వేశారు. స్థానిక చెరువు బజారులో మూతపడి ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్​ను సీజ్​ చేశారు.

తాగునీటి కుళాయి పన్నులు చెల్లించనివారి ఇళ్ల వద్ద నీటి కుళాయిలను ఆపేశారు. అధికారుల తీరుపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస సమయం ఇవ్వకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పన్ను కట్టని ఇంటికి తాళం వేస్తున్న అధికారులు


ఇదీ చదవండి:ఉద్యమానికి తెదేపా పిలుపు.. నేతల గృహ నిర్బంధం

Last Updated : Mar 23, 2022, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details