ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ, పదవీ విరమణ వయసు పెంపు సంబంధిత అంశాలపై గుర్తింపు సంఘాలతో అధికారుల కమిటీ చర్చలు పూర్తయ్యాయి. పీఆర్సీ నివేదికపై సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ... మూడు రోజులుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. నివేదికలోని అంశాలపై ఆయా సంఘాల అభిప్రాయాలు, వినతులు స్వీకరించింది. గుర్తింపు పొందిన 13 సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్నారు.
ఉద్యోగ సంఘాలతో ముగిసిన అధికారుల చర్చలు - prc updates
పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాలతో మూడు రోజులుగా అధికారుల కమిటీ నిర్వహిస్తున్న చర్చలు పూర్తయ్యాయి. గుర్తింపు పొందిన 13 సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను అధికారులు తీసుకున్నారు. మిగతా సంఘాల అభిప్రాయాలు కూడా తీసుకుని తుది నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించనున్నారు.
officers prc discussions completed with employees
ఇందులో ఐదు ఉద్యోగ సంఘాలతో పాటు ఎనిమిది ఉపాధ్యాయ సంఘాలుండగా... గుర్తింపు పొందిన అన్నింటితో చర్చలు పూర్తయ్యాయి. అయితే తమను కూడా చర్చలకు పిలిచి... అభిప్రాయాలు తీసుకోవాలని ఇతర సంఘాలు కోరుతున్నాయి. ఇంకా చాలా సంఘాలు ఉన్న దృష్ట్యా... చర్చలు కాకుండా వారి అభిప్రాయాలు మాత్రమే స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత అన్నింటినీ క్రోడీకరించి ముఖ్యమంత్రికి అధికారులు నివేదించనున్నారు.