తెలంగాణ

telangana

ETV Bharat / city

విశాఖలో ఖాళీ స్థలాల గురించి అధికారుల ఆరా..!

విశాఖలో కార్యనిర్వాహక రాజధాని రావచ్చన్న ప్రకటనలతో అధికారులు అప్రమత్తమయ్యారు. భవనాల నిర్మాణాలకు ఏ ప్రాంతాలు అనుకూలమన్న అంశంపై జిల్లా అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.

ap capital
విశాఖలో ఖాళీ స్థలాల గురించి అధికారుల ఆరా..!

By

Published : Dec 22, 2019, 10:07 AM IST

విశాఖలో ఖాళీ భవనాలు ఎక్కడున్నాయి... వాటిలో ఎంత విస్తీర్ణం అందుబాటులో ఉందన్న విషయాలను అధికారులు ఆరా తీస్తున్నారు. సాగర నగరంలో కార్యనిర్వాహక రాజధాని రావచ్చన్న ప్రకటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. భవనాల నిర్మాణాలకు ఏ ప్రాంతాలు అనుకూలమన్న అంశంపై జిల్లా అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.

విప్రో సంస్థకు నగరం నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం 7 ఎకరాలు కేటాయించింది. కొంత భాగంలో మాత్రమే ఒక భవనాన్ని విప్రో సంస్థ నిర్మించింది. మిగిలిన భూభాగాన్ని ఖాళీగా ఉంచింది. విప్రో కార్యాలయాన్ని జేసీ వేణుగోపాలరెడ్డి శనివారం పరిశీలించారు. అధికారులు, ఉద్యోగులను అడిగి స్థలం వివరాలు తెలుసుకున్నారు. రాజధానికి సంబంధించిన భవనాల పరిశీలన కోసం కాదన్న జేసీ... హైదరాబాద్‌ విప్రో భవనానికి విశాఖ భవనానికి గల తేడాలు చూసేందుకే అక్కడకు వెళ్లామని చెప్పారు. రాజధాని ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని... తాము ఎలాంటి పక్రియ ప్రారంభించలేదని పాలనాధికారి వినయ్‌ చంద్‌ స్పష్టం చేశారు.

ఇవీచూడండి:అక్కడ నీది నాది ఒకటే నినాదం.. ఇంటికి వంద-బడికి చందా

ABOUT THE AUTHOR

...view details