తెలంగాణ

telangana

ETV Bharat / city

Fake seeds: నకిలీ విత్తనాలపై కొరడా.. వేల క్వింటాళ్లు స్వాధీనం - నకిలీ విత్తనాలపై కొరడా

నకిలీ విత్తనాలపై పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. వేల క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. ఉత్తర్ మండల రేంజ్ లో 117 కేసుల్లో 311క్వింటాళ్ల నకిలీ విత్తనాలు పట్టుకున్నారు. 204 మందిని అరెస్ట్ చేశారు. పశ్చిమ మండల రేంజ్ లో 152 కేసుల్లో 3వేల631 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక నల్గొండ జిల్లాలో 6 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను.... పోలీసులు పట్టుకున్నారు.

officers focus on fake seeds in telangana
officers focus on fake seeds in telangana

By

Published : Jun 19, 2021, 4:17 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశంతో... నకిలీ విత్తనాలు అమ్మే ముఠాలపై.. పోలీసులు ఉగ్రనరసింహావతారం ఎత్తుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలు అమ్మేవారిని కటకటాలపాలు చేస్తున్నారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని రైతులు ఇచ్చిన ఫిర్యాదుతో.. నిఘా పెట్టిన నల్గొండ జిల్లా పోలీసులు.. భారీగా సరకును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 16 మందికి గాను 13 మందిని అరెస్టు చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. నకిలీ పత్తి విత్తనాలతోపాటు... వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు తయారు చేసి అమ్ముతున్న విషయాన్ని.. దేవరకొండ ప్రాంతానికి చెందిన రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గతంలో పీడీ యాక్టు నమోదైన కర్నాటి మధుసూదన్ రెడ్డి.. జైలు నుంచి విడుదలైన అనంతరం అదే దందా కొనసాగిస్తూ పట్టుబడ్డాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 9 రోజుల వ్యవధిలోనే.. 20 కోట్ల విలువైన నకిలీ సరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కుమురం భీం జిల్లా దహేగం మండలంలో భారీగా నిషేధిత పత్తి విత్తనాలు పోలీసులు పట్టుకున్నారు. 17 లక్షలు విలువైన పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అమాయక రైతులకు నిషేధిత విత్తనాలు అంటగడితే... ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని రామగుండం కమిషనర్... కుమురం భీం జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ సత్యనారాయణ హెచ్చరించారు.

నకిలీ విత్తనాల పట్ల ప్రజలు అప్రమత్తతతో వుండటంతో పాటు... నకిలీ సరకుపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ప్రజలకు పిలుపునిచ్చారు. కల్తీ విత్తనాల కట్టడి కోసం.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి అనుమానిత ప్రాంతాల్లో దాడులు చేపట్టడంతో పాటు.. విత్తన విక్రయ కేంద్రాలపై తనిఖీలు చేపట్టడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చూడండి: PM Modi: 66 శాతం మంది మోదీకే జై!

ABOUT THE AUTHOR

...view details